గణపవరం గ్రామానికి తెలగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కెల్లంపల్లి అచ్చయ్య

నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి తెలగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కెల్లంపల్లి అచ్చయ్య నియమితులయ్యారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో తనకు ఈ పదవి వచ్చిందని ఈ సందర్భంగా కెల్లంపల్లి అచ్చయ్య తెలిపారు.శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తన నియామకాన్ని స్వాగతిస్తూ, కెల్లంపల్లి అచ్చయ్యను దుశ్యాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, పెంట్యాల శేషగిరిరావు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.గణపవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కెల్లంపల్లి అచ్చయ్యకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చయ్య నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Share.
Leave A Reply