చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు
భారతీయ జనసంఘ్ స్థాపకులు “డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ “గారి జయంతి ( జూలై 6) సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
◆శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు.వారి జీవితంలో ప్రతిక్షణం,శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి.
◆1901 జూలై 6వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు.తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు పుణికి పుచ్చుకున్నారు.వాటిలో అతి ప్రముఖ గుణం అసుతోష్ ముఖర్జీ యొక్క ప్రఖరమైన, రాజీలేని జాతీయ భావన, అతడి నిర్భీక మనస్తత్వం.
◆శ్యామాప్రసాద్ కు భగవంతుడు ఇచ్చిన మరో వరం అసామాన్యమైన అతడి మేధాశక్తి. అతడి తెలివితేటలు, గ్రహణశక్తి చూసి పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విస్మయం చెందుతూ ఉండేవారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే శ్యామాప్రసాద్ ఎఫ్.ఏ, బి.ఏ విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేస్తుండేవాడు.
◆అతి చిన్న వయసు నుంచి శ్యామాప్రసాద్ ఆదర్శవాదిగా రూపుదిద్దుకోసాగాడు.
◆ ‘నేను గొప్ప వ్యక్తిని కావాలి.నాకు ధనం వద్దు’ ఒక పుస్తకంలో శ్యామాప్రసాద్ రాసిన మాట అతడి ఆదర్శవాది ఆలోచనలకు తార్కాణం.ఆ విధంగా రూపొందిన ఆదర్శవాదం చిట్టచివరి క్షణం వరకు నిలిచింది .ఆ ఆదర్శవాదమే అతడినొక మహనీయ వ్యక్తిగా రూపొందించింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్రి జయరాం రెడ్డి నియోజకవర్గం కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు బిజెపి ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రు పూర్ణచందర్రావు పల్నాడు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా ఓ బి సి ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి పట్టణ మాజీ అధ్యక్షులు పుత్తూరి బ్రహ్మానందం నాదెండ్ల మండల మాజీ అధ్యక్షులు శివ కోటిరెడ్డి బిజెపి నాయకులు గట్ట హేమ ఆలేటి ప్రసాదు మాజీ టౌన్ సెక్రెటరీ ఎండి గౌస్ మహిళ నాయకురాలు శ్రీరామ్ఎఫ్తేరు తదితరులు పాల్గొన్నారు.



