మెగా పిటిఎం లో విట్నస్ అధికారి నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి.ఎస్టీయూ డిమాండ్.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలలో ఈనెల 10వ తేదీన జరగాల్సిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం లో విట్నస్ అధికారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని వారిచేత వీడియోలు తీయించి అప్లోడ్ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని ఎస్టియూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల విద్యాభివృద్ధి మీద, పాఠశాలల్లో ఉన్న మౌళిక సదుపాయాల మీద మాట్లాడుకోవడానికి 17 రకాల కమిటీలు, ఫోటోల అప్లోడ్ లు, విట్నస్ అధికారులు ఇంత తతంగం అవసరమా? అని ప్రశ్నించారు. పి.టి.ఎం. కార్యక్రమాన్ని డాక్యుమెంట్ కార్యక్రమంగా మార్చడం సరికాదని, విద్యార్థుల విద్యాభివృద్ధి గురించి చర్చించే కార్యక్రమంగా దీనిని మార్చాలని ఎస్టీయు కోరుతున్నదని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పిన పాఠశాల విద్యాశాఖ దానికి భిన్నంగా బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను వినియోగిస్తుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల ప్రారంభమయిన నెల రోజుల లోపే యోగా పేరుతో వారం రోజులు, పి.టి.ఎం. పేరుతో మరో వారం రోజులు బోధన సమయాన్ని హరిస్తున్నారని తెలిపారు. ఒక ప్రక్క విద్యార్థుల ఔట్పుట్ కోసం పర్యవేక్షణ అధికారులు పాఠశాలలకు వస్తారని చెబుతూ మరోప్రక్క బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఉపాధ్యాయులని తిప్పు తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనకు పరమితం చేయకుండా, బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడికి గురి చేసే విధానాన్ని ఉపసంహరించు కోవాలని కోరారు. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ అధికారులు పాఠశాల సమయంలో బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను వినియోగించు కునేటట్లు చూడాలని, మెగా పి.టి.ఎం.లో విట్నస్ అధికారి నియామకాన్ని తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే వైఖరితో ప్రభుత్వం ముందుకు వెళితే బోధన కుంటు పడుతుందని భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ఉపాధ్యాయుల, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పునరాలోచించుకోవాలని కోరారు.పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లన అజయ్ ప్రకాష్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి, పట్టణ నాయకులు చిలకా వీరయ్య అట్లూరి శ్రీనివాసరావు సోమల నాయక్ మురికిపూడి చిన్న వెంకటస్వామి కుంభ ఏడుకొండలు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఎస్టీయూ నాయకులు. పాల్గొన్నారు.

Share.
Leave A Reply