డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
గత నెల రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున నియామకాలు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుతున్నట్లు ఎస్టీ యూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జూన్ నెలలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో డీఎస్సీ ఖాళీలు కూడా చూపించి నందు వలన మారుమూల ప్రాంతాలలో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున వీలైనంత త్వరగా మెరిట్ లిస్టు విడుదల చేసి తద్వారా సెలెక్షన్ లిస్టు తయారు చేసి వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉపాధ్యాయ నియామక చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాఠశాల విద్యాశాఖను కోరినట్లు ఎస్టియు నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన లక్షలాదిమంది ఉద్యోగులు నిరీక్షిస్తున్నందున వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడకుండా వెంటనే నియామకం ప్రక్రియ చేపట్టాలని కోరారు, ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించడం వల్ల కొన్ని పాఠశాలల్లో ఎక్కువమంది ఉపాధ్యాయ పాఠశాలల్లో రిలీవర్ లేక ఆగిపోయి ఉన్నారని తెలిపారు. హైస్కూల్స్లో సబ్జెక్టు టీచర్లు పోస్ట్లుఖాళీలు డీఎస్సీకి రాసినందున వారు వచ్చేవరకు సబ్జెక్టు బోధన ఇబ్బందికరంగా మారుతుంది కావున డీఎస్సీ పోస్టుల్లో సెలెక్ట్ అయిన వారు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లన అజయ్ ప్రకాష్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి, పట్టణ నాయకులు చిలకా వీరయ్య అట్లూరి శ్రీనివాసరావు సోమల నాయక్ మురికిపూడి చిన్న వెంకటస్వామి కుంభ ఏడుకొండలు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఎస్టీయూ నాయకులు. పాల్గొన్నారు.

Share.
Leave A Reply