ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- టీడీపీ శ్రేణులు, పార్టీ… ప్రభుత్వం తమకు మేలుచేయడం లేదనే అపోహ వీడాలి : ప్రత్తిపాటి.
- పార్టీ అధికారంలో ఉండి, ప్రజలకు సేవచేయడాన్ని మించిన గుర్తింపు ఉండదని గ్రహించండి :ప్రత్తిపాటి
- 15 ఏళ్లు అధికారంలో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది : ప్రత్తిపాటి
- సొంత కార్యకర్తల్ని కారుతో తొక్కించినవారు జనానికి మేలుచేస్తారంటే నమ్ముతారా : ప్రత్తిపాటి.
- చంద్రబాబు పనితీరు..పథకాల జోరు జీర్ణించుకోలేకనే దుష్ప్రచారం చేస్తున్నారు : ప్రత్తిపాటి
- దోచుకోవడం తప్ప గతపాలకులు రాష్ట్రానికి, నియోజకవర్గానికి చేసిందేమీ లేదు : ప్రత్తిపాటి
నియోజకవర్గంలోని వాగుల్ని ఆధునికీకరించి, వ్యవసాయానికి కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల్ని బాగుచేయాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి విన్నవించానని, ప్రభుత్వం సకాలంలో స్పందించి వాగుల్లోని కంపచెట్లు, పూడికతీతకు రూ.2.50కోట్లు కేటాయించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా ప్రత్తిపాటి గురువారం చిలకలూరిపేట మండలం పసుమర్రులో పర్యటించారు. స్థానిక పశువైద్యశాలలో నట్టల నివారణ మందు.. పశుగ్రాస విత్తనాల పంపిణీ ప్రారంభించిన అనంతరం, స్వయంగా ఎక్సకవేటర్ నడిపి ఓగేరు వాగు ఆధునికీకరణ పనుల్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని.. గత పాలకులుచేసిన విధ్వంసాన్ని మర్చిపోతే ఎలాగన్న ప్రత్తిపాటి… ప్రజలు నేడు ప్రశాంతంగా తమ పనితాము చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తూ, హాయిగా ఉండటానికి కారణం కూటమిప్రభుత్వం చంద్రబాబు నాయకత్వమేనన్నారు.
ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో ఏపీనే టాప్..
చెప్పిందిచెప్పినట్టుగా తల్లికి వందనం అమలుచేసిన ఘనత కూటమిప్రభుత్వానిదేనని, గతపాలకుల్లా తల్లుల్ని, విద్యార్థుల్ని, ముఖ్యంగా ప్రజల్ని మోసగించలేదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. సూపర్-6 హామీల అమల్లో ముఖ్యమైన తల్లికి వందనం అమలైందని, ఈ నెలలోనే అన్నదాతా సుఖీభవ.. వచ్చేనెలలో ఉచిత బస్సుప్రయాణం అమలు కానున్నాయన్నారు. నిరుద్యోగ భృతికూడా త్వరలోనే అమలుచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అన్నాక్యాంటీన్లు.. రోడ్లు.. డ్రైనేజ్ లు… సామాజిక భవనాలు.. ఇళ్ల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధిపనులు కూటమిప్రభుత్వం చేసిందన్నారు. ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంటుందని, దరిదాపుల్లో మరే రాష్ట్రం ఉండదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. మూడుపార్టీలు కలిసుండబట్టే రాష్ట్రానికి, తమకు మేలు జరుగుతుందుని ప్రజలు గ్రహించాలన్నారు. 15 ఏళ్లుకూటమిప్రభుత్వం అధికారంలో ఉంటే, చివరన ఉన్నవారికి కూడా కచ్చితంగా న్యాయం జరుగుతుందని, పార్టీ అధికారంలో ఉండటం..ప్రజలకు సేవచేయడమే గొప్పబలమనే నిజాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలని ప్రత్తిపాటి సూచించారు.
రాష్ట్రానికి.. ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయకత్వమే ఉండాలి
చంద్రబాబు నాయకత్వంలో జరిగే అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే వైసీపీ దుష్ప్రచారంచే స్తోందన్న ప్రత్తిపాటి, సొంత కార్యకకర్తను కారుకింద తొక్కించినవారు ప్రజలకు మేలుచేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయకత్వమే ఉండాలని, ఆయన లేకుంటే మరలా నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తుందనే ప్రత్తిపాటి స్పష్టంచేశారు. జగన్ మరోసారి గెలిచి ఉంటే ప్రజల ఆస్తులు..భూములు అన్నీ స్వాహా అయ్యేవని, చంద్రబాబు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుచేయబట్టే మీ భూములు మీరుసాగుచేసుకుంటున్నారని ప్రత్తిపాటి చెప్పారు. గతంలో అవినీతి మంత్రి గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రు గ్రామాల్ని మున్సిపాలిటీలో విలీనంచేసి, అభివృద్ధి లేకుండా చేసిందన్నారు. పసుమర్రు గురించి తెలియని వారికి, గ్రామస్తుల జీవనవిధానం తెలియని వారికి గతంలో ఓట్లు వేయబట్టే నియోజకవర్గప్రజలు నష్టపోయారని ప్రత్తిపాటి తెలిపారు. మిర్చి, బర్లీ పొగాకు కొనుగోళ్లు సహా, నియోజకవర్గంలోని పలు సమస్యలపై అసెంబ్లీలో ముందు మాట్లాడింది తానేనన్న ప్రత్తిపాటి, పలు గ్రామాల సమస్యల్ని పరిష్కరించడానికి తనవంతు కృషిచేస్తున్నానని స్పష్టంచేశారు.
గ్రామస్తులు ఐక్యంగా లేకపోతే…వారితో పాటు గ్రామమూ నష్టపోతుంది…
1999-2004 మద్య పసుమర్రు రైతాంగం కోసం రూ.10కోట్లతో లిఫ్ట్ ఏర్పాటుచేయడం జరిగిందని, ఆనాడు పెట్టిన ఖర్చు.. ఇప్పుడు రూ.100కోట్లకు సమామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామానికి మేలుచేయడానికి ఎంతోకష్టపడి లిఫ్ట్ ఏర్పాటుచేస్తే, దాన్ని దుర్వినియోగం చేయడం బాధకలిగించిందన్నారు. గ్రామస్తులు ఐక్యంగా లేకపోతే … గ్రామంతో పాటు వారూ బాగుపడరనే వాస్తవాన్ని ఇప్పటికైనా అందరూ గ్రహించాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రభుత్వం.. పార్టీ తమకు ఏమీ చేయడంలేదని అనుకోవడం సరైనపద్ధతి కాదన్న ప్రత్తిపాటి… ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, ధైర్యంగా బతికేలా వారిపనులు వారుచేసుకునేలా చేయడాన్ని మించిన సాయం ఉండదనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. గతంలో ఐదేళ్లు టీడీపీ అధికారంలో లేకపోతే ఎంత నష్టం జరిగిందో, అందరం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇప్పటికైనా గ్రహించకపోతే ఎలాగని ప్రత్తిపాటి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండబట్టే..మీరు, నేను అందరం ప్రశాంతంగా ఉన్నామని, అర్హతకలిగిన ప్రతి మహిళకు తల్లికి వందనం.. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ అమలయ్యాయన్నారు. గత పాలకులు పసుమర్రును దోచేసినంతగా నియోజకవర్గంలో మరే గ్రామాన్ని దోచుకోలేదని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.. దోచుకోవడం తప్ప.. మరేమీ తెలియని వారిని గెలిపించారని, అటువంటి తప్పులకు చోటులేకుండా అందరం ఏకతాటిపై నిలిచి రాష్ట్రప్రగతిలో భాగస్వాములవుదామని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి సమన్వయ కర్త నెల్లూరి సదాశివరావు, అబ్జర్వార్ ఉష రాణి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, గంగా శ్రీను, గ్రామ నాయకులు జాలాది సుబ్బారావు, గ్రామ ప్రెసిడెంట్ కొడవలి శ్రీను, కిషోర్, షేక్ జానీ, చైతన్య, చౌదరి, రాయుడు, రఫీ, మస్తాన్ వలి, నాగుర్, మహమ్మద్ రఫీ గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.