జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
చిలకలూరిపేట 26వ వార్డులోని తిరుపతమ్మ గుడిలో సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. చరణ్ తేజ పేరు మీద తమ సొంత నిధులతో జనసేన నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులు, మరియు ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన యువనాయకులు మండల నేనిచరణ్ తేజ పేరు మీద చేపట్టిన రెండో సేవా కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 26వ వార్డు జనసేన నాయకులు పీఎస్ఆర్, మీసాల రాజు, మీసాల లక్ష్మణ్, ఉపేంద్ర, బొంతు రామారావు, సంతు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.