రక్తదాన శిబిరాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు

మండల కేంద్రమైన నాదెండ్ల ఎంపీడీవో కార్యాలయలో గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు, సొసైటీ సభ్యులతో మాట్లాడిన ఆయన, రక్తదాన ఆవశ్యకతపై యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు. రక్తదానాన్ని జీవితంలో కచ్చితంగా చేపట్టాల్సిన ఒక మంచి కార్యక్రమంగా నేటి యువత భావించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ప్రత్తిపాటి నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆయన రక్తదాతలతో మాట్లాడి, వారికి ప్రశంసాపత్రాలు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప రాణి, ఎమ్మార్వో , టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply