చేనేత కార్మికుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మాజీమంత్రి ప్రత్తిపాటి.
చేనేత దౌలిశాఖ నుండి చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా మినీ క్లస్టర్ లో 93 లక్షల రూపాయలు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ మాజీమంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విధివిధానాలు, దానికి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించటం కోసం ప్రత్తిపాటి పుల్లారావు గారితో అధికారులు చర్చించారు. అతి త్వరలోనే నియోజకవర్గంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసేలా చూడాలి అని ప్రత్తిపాటి అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమల రవి, కందుల రమణ, గంజి శ్రీనివాసరావు, అవ్వారు రమేష్, మనోహర్, ఈవూరి బ్రహ్మానందం, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.