జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు చేతుల మీదుగా “షైనింగ్ స్టార్” అవార్డు..
కేజీబీవీ విద్యార్థిని షీక్ నాగూర్..1000 మార్కులకు గాను 926 మార్కులు
20వేల చెక్ అందుకున్న విద్యార్థిని..
చిలకలూరిపేట: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పేట రూరల్ పరిధిలోని పోతవరం కేజీబీవీ విద్యార్థిని షీక్ నాగూర్ షర్మీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.1000 మార్కులకు గాను 926 మార్కులు సాధించి గొప్ప విజయాన్ని అందుకుంది.షర్మీకి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా “షైనింగ్ స్టార్” అవార్డు లభించింది.ఈ విజయం ఆమె కృషికి, పట్టుదలకు నిదర్శనం. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షేక్.అషరీఫున్ మాట్లాడుతూ విద్యారంగంలో మెరిట్ సాధించిన పేద విద్యార్థులను ప్రోత్సహించేలా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావులకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించటం సరికొత్త అధ్యాయమన్నారు. కేజీబీవీ పోతవరం నుంచి ఈ పురస్కారం అరవింద్ బాబు కలెక్టర్ పి.అరుణ్ బాబులు చేతుల మీదుగా అందుకొని 20వేల రూపాయలు చెక్కునందుకోవటం ఎంతో గర్వకారణంగా ఉందని కేజీబీవీ ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.