చిలకలూరిపేటలో వార్డుల్లో వీధిలైట్ల మరమ్మతులు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో చర్యలు
చిలకలూరిపేట పట్టణంలోని 29వ వార్డు పీర్ల మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వెలగని వీధిలైట్లను గుర్తించి, వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.మున్సిపల్ సిబ్బందితో కలిసి వెలగని లైట్లను గుర్తించిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, వెంటనే వాటిని రిపేరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం లేదా లైట్ల లోపాలు తలెత్తడం వల్ల పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను, సంబంధిత వార్డు కౌన్సిలర్‌ను ఆదేశించారు. పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చురుకుగా వ్యవహరించి, పీర్ల మన్యం ప్రాంతంలోని వెలగని వీధిలైట్లన్నింటినీ గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలగని వీధిలైట్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మరమ్మతుల పనులు త్వరలో పూర్తవుతాయని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తెలిపారు
Trending
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు
- వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్