పేట అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు కృషి: మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, తన చాంబర్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిందని, ఈ కాలంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

సాగర్ నుండి చిలకలూరిపేట మంచినీటి చెరువుకి నేరుగా పైప్‌లైన్ వేయించడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో ప్రత్తిపాటి పుల్లారావుకు మున్సిపల్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సర కాలంగా, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం మరియు తాగునీటి విషయంలో చాలా కట్టుదిట్టంగా వ్యవహరించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వడం కూడా ప్రశంసనీయం అని చైర్మన్ పేర్కొన్నారు.

మంచినీటి చెరువులు నిండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం

నిన్నటితో ఒక చెరువు పూర్తిగా నిండిందని, ఈరోజు మరొక చెరువు నిండుతుందని, రానున్న నాలుగు నెలల పాటు చిలకలూరిపేట ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కృషి చేశారని షేక్ రఫాని తెలియజేశారు.

అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు

నూతన రోడ్లు మరియు రోడ్ల మరమ్మత్తుల కోసం రూ. 2 కోట్లు, అలాగే బీపీఎల్ స్కీమ్ కింద రూ. 4 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్తిపాటి పుల్లారావు తీసుకొచ్చారని చైర్మన్ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రత్తిపాటి పుల్లారావుకు ధన్యవాదాలు తెలియజేశారు.చివరగా, టెండర్లు పిలిచిన పనులన్నీ ఈ కౌన్సిల్‌లోనే పూర్తయ్యే విధంగా చూడాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును విజ్ఞప్తి చేశారు.

116 కోట్లతో 38 కిలోమీటర్ల పైప్ లైన్ ని తీసుకువచ్చిన ఘనత ప్రత్తిపాటి పుల్లారావుకే దక్కుతుంది

కౌన్సిలర్ కునల ప్రమీల

చిలకలూరిపేట పురపాలక సంఘంలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో 22వ వార్డు కౌన్సిలర్ కునల ప్రమీల మాట్లాడుతూ, చిలకలూరిపేట ప్రజల దాహార్తిని తీర్చడంలో మాజీ మంత్రి, ప్రస్తుత శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చూపిన నిబద్ధతను ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ₹116 కోట్లతో 38 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత ప్రత్తిపాటి పుల్లారావుకే దక్కుతుందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.గతంలో కూడా చిలకలూరిపేట అభివృద్ధిలో పుల్లారావు ప్రముఖ పాత్ర పోషించారని, ఆయన నాయకత్వంలో పట్టణం అభివృద్ధి పథంలో వేగంగా పయనించిందని ప్రమీల పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడం ప్రజలకు అదృష్టమని ఆమె అన్నారు. చిలకలూరిపేట ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రత్తిపాటి పుల్లారావు చేసిన కృషికి మున్సిపల్ కౌన్సిలర్ ప్రమీల ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్యశాఖ ద్వారా 10 కోట్ల రూపాయలు అభివృద్ధికి మంజూరు చేయించిన ఘనత ప్రతిపాటిదే

పదో వార్డ్ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి

చిలకలూరిపేటలో 100 పడకల ఆసుపత్రిని తీసుకురావడంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కీలక పాత్ర పోషించారని పదవ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన అభివృద్ధిని ఆ దిశగా అడుగులు వేసే నాయకుడు ప్రత్తిపాటి అని కొనియాడారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకోలేదని, కరోనా సమయంలో కేవలం వినియోగించుకొని ఆ తర్వాత డస్ట్‌బిన్‌లా పక్కన పడేశారని మౌలాలి ఆరోపించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆసుపత్రిని పదిసార్లు సందర్శించి, అవసరమైన సదుపాయాలను గుర్తించారని తెలిపారు. ఆరోగ్య శాఖ నుండి రూ. 10 కోట్లు తీసుకొచ్చి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు.ప్రత్తిపాటి పుల్లారావు చేసిన ఈ కృషికి చిలకలూరిపేట ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని పదవ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోకౌన్సిలర్ లక్ష్మీ తిరుమల,కౌన్సిలర్ జంగా సుజాత, పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

Share.
Leave A Reply