బక్రీద్ సందర్భంగా ఆవులను, దూడలను వధిస్తే చర్యలు తప్పవు..

వినుకొండ :- బక్రీద్ పండుగ ను పురస్కరించుకొని పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడాను ఆవులను,దూడలను వధించరాదని మునిసిపల్ కమిషనర్ యమ్. సుభాష్ చంద్ర బోస్ అన్నారు.గురునాడు పురపాలక సంఘ కార్యాలయ కమిషనర్ వారి ఛాంబర్ నందు సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యవసాయానికి పనికిరాని జంతువులను మాత్రమే వెటర్నరీ వైద్యుల ధ్రువీకరణ పత్రం పొంది అధికారులు తెలిపిన ప్రాంతాలలో మాత్రమే వధించుకోవాలి అని ఆయన తెలిపారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వధించకూడదని తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల నిబంధనలను ఉల్లంఘిస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా మసీదుల దగ్గర ఎటువంటి అవాంఛనీలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Share.
Leave A Reply