మొక్కలు నాటిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ శంకరభారతి పురం ప్రభుత్వ పాఠశాల ఎస్ ఎస్&ఎన్ కళాశాలలో మొక్కలను నాటారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని రక్షించుకునే బాధ్యత తీసుకుందామని ప్రతి ఒక్కరం మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమలకు శ్రీకారం చేపట్టడం మంచి ఆలోచన అని స్వచ్ఛ ఆంధ్ర హరిత ఆంధ్ర యోగ ఆంధ్ర వంటి కార్యక్రమాలు విజయవంతగా జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంధాలయాలు చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు