యడ్లపాడులో ఘనంగా రక్తదాన శిబిరం

చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని యడ్లపాడులోని ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు రెడ్‌క్రాస్ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యడ్లపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు పర్యవేక్షించారు.ఈ రక్తదాన శిబిరంలో ఎంపీడీవో మరియు ఎమ్మార్వోతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కామినేని సాయిబాబు తెలిపారు.
ఈ సందర్భంగా కామినేని సాయిబాబు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని, ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినట్టేనని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంపీడీవో, ఎమ్మార్వోతో పాటు రెడ్‌క్రాస్ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మద్దినేని సుబ్బారావు, పోపూరి వెంకయ్య మరియు బోడా, సద్దాం తదితరులు పాల్గొన్నారు

Share.
Leave A Reply