శ్రీ దత్త సాయి సన్నిధిలో శాసనసభ్యులు శ్రీ పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం–

చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం గౌరవ శాసనసభ్యులు , మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం పుల్లారావు గారి పేరు మీదుగా వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, అనంతరం ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఎంతోమందికి కంటి చూపును ప్రసాదించి, నియోజకవర్గ ప్రజలను తమ సొంత కన్నబిడ్డలుగా చూసుకునే పత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని వారి కుటుంబాన్ని ఆ సాయినాధుడు ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఆశీర్వదించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పి అన్నదాత గారు పాల్గొని భక్తులకు అన్నసంతర్పణ చేశారు

Share.
Leave A Reply