ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు, పేదలకు దుస్తులు పంపిణీ-చైర్మన్ రఫాని
మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ స్కావెంజర్స్ వర్కర్స్ కు బట్టల పంపిణీ చేశారు.
మున్సిపల్ చైర్మన్ రఫాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు,జనసేన నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నాడు పేదలకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషం గా ఉందని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.



