వైద్యశాలలో కాన్పుల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్వో రవి

నాదెండ్ల: ప్రభుత్వ వైద్యశాలలో బయటి రోగుల (ఓపీ) సేవలతో పాటు ప్రసూతి కాన్పుల సంఖ్య గణనీయంగా పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి రవి ఆదేశించారు.

నాదెండ్ల మాతా శిశు ఆరోగ్య (పీహెచ్సీ) కేంద్రాన్ని డీ.ఎం.హెచ్.వో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆసుపత్రిలోని వార్డులు, రక్త పరీక్షల కేంద్రం, శస్త్రచికిత్సల గది, ఔషద దకాణాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

రోగులుకు అందించాల్సిన సేవలపై పలు సూచనలు ఇచ్చారు.

కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ శ్వేత, డాక్టర్ జ్ఞానేశ్వరి ఎంపీహెచ్ఎస్ దిలీప్ కుమార్, యూడీసీ హనుమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply