సమస్యలను ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు

జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు సంబంధించి ఫిర్యాదులను నేరుగా collectorate నరసరావుపేట లో లేదా ఆయా మండలాల్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కర వేదిక లో గాని ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు. పరిష్కార వేదికకు హాజరు కాలేని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి ఫిర్యాదుల నమోదు చేయించుకోవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఇచ్చిన ఫిర్యా దులకు సంబంధించిన స్థితిని తెలుసుకు నేందుకు మరియు సమాచారం తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ చెప్పారు.
అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నేరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Share.
Leave A Reply