మహానాడు విజయవంతం మన బాధ్యత : మాజీమంత్రి ప్రత్తిపాటి
- నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీసంఖ్యలో తరలి వెళ్లాలి.
“దేవని గడప కడపలో జరిగి తొలిమహానాడు విజయవంతం మనందరి ప్రధాన బాధ్యత. తెలుగుదేశం పార్టీ జాతీయఅద్యక్ష ఎన్నిక మొదలు అనేక సంస్థాగత నిర్ణయాలకు కేంద్రబిందువు కానున్న మహానాడు మనకెంతో ప్రత్యేకం. ఈ మహానాడులో యువత, మహిళలు, రైతుల సంక్షేమం సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రధాన అజెండాగా పలు నిర్ణయాలను అధినాయకత్వం ప్రకటించనుంది. అదేవిధంగా కూటమిప్రభుత్వ ఏడాది పాలనా విజయాలు, భవిష్యత్ ఆలోచనలపై మహానాడులో సమగ్రచర్చ జరగనుంది. మూడురోజులు కన్నుల పండువగా జరిగే తెలుగుప్రజల మహాపండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వర్షం వచ్చినా కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీస్, రెవెన్యూ తదితర విభాగాలు, స్థానిక నాయకుల సహాకారంతో మహానాడుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. కడపలో జరుగుతున్న తొలి మహానాడుకు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు, నారా.. నందమూరి అభిమానులు భారీసంఖ్యలో తరలివెళ్లి, జయప్రదం చేయాలి. మహానాడుకు వెళ్లినవారు తిరిగి గమ్యస్థానాలకు చేరేవరకు ప్రయాణంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒకప్రకటనలో సూచించారు



