శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ ఆత్మహత్య
సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు స్వాహా
శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ వారు డబ్బులు కట్టాలని పదే పదే ఒత్తిడి
ఒత్తిళ్లు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న జక్క శ్రీరామ్ కుమార్
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య
గణపవరం లోని జక్క శ్రీరామ్ కుమార్ ఇంట్లో ఘటన, ఘటనా స్థలాన్ని పరిశీలించి న నాదెండ్ల SI జీ. పుల్లారావు
వివరాలు ఇలా…..
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ని జక్క వారి వీధి కి చెందిన జక్క శ్రీరామ్ కుమార్ గత ఆరు సంవత్సరాల నుంచి చిలకలూరిపేట శ్రీరామ్ ఫైనాన్స్ నందు రికవరీ మేనేజర్ గా పని చేస్తున్నాడు.శ్రీరామ్ ఫైనాన్స్ కు సంబంధించి న రికవరీ డబ్బులు ఆఫీస్ కు చెల్లింపు లు చేయకుండా శ్రీరామ్ కుమార్ జల్సా లకు వాడుకున్నాడు.
మొత్తం సుమారు40లక్షల నుంచి60లక్షల వరకు ఉన్న నేపథ్యంలో శ్రీరామ్ ఫైనాన్స్ వారు డబ్బులు చేల్లించాలని పదే పదే ఇంటి దగ్గర కు వచ్చి గొడవ చేయడంతో,,, చేసేది ఏం లేక సోమవారం ఉదయం10 :15 లకు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఫ్యాన్ కు తన భార్య చున్నీ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య సింధు గణపవరం గ్రామ పంచాయతీ లో బిల్ కలెక్టర్ గా పని చేస్తోంది.
భార్య సింధు భోజన విరామ సమయంలో ఇంటి వద్ద వచ్చి మూసిఉన్న తలుపులు తీయగానే ఫ్యాన్ కు వేలాడుతూ భర్త శ్రీరామ్ కుమార్ కనిపించాడు.
సింధు బయపడి కేకలు వేయడం తో చుట్టూ ప్రక్కల వారు వచ్చి చూసి పోలీసులు కు సమాచారం అందించారు.
SI పుల్లారావు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యసలాకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
“