ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన..
దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందజేత
దాతృత్వంచాటుకున్న క్లబ్ సభ్యులు
చిలకలూరిపేట:
సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ప్రజలకు ముఖ్యంగా మహిళలకు న్యాయ పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్న ఇన్నర్‌వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సేవలు ప్రశంసనీయమైనవని న్యాయవాదులు మాదాసు భానుప్రసాద్, శ్రీనివాసరావు చెప్పారు.
ఇన్నర్‌వీల్ క్లబ్ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని సుగాలికాలనీ అంగన్‌వాడీ కేంద్రం వద్ద మహిళలకు వివిధ అంశాలపై న్యాయవాదులు మాదాసు భానుప్రసాద్, శ్రీనివాసరావు అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షురాలు గట్టు సరోజిని అధ్యక్షత వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాధమిక న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవడం వల్ల సమాజం మెరుగవుతుందని, ప్రజలకు వారి హక్కులు తెలుసుంటే, వారు వారి హక్కులను కాపాడుకోవచ్చుని, సమాజంలో న్యాయం కోసం పోరాడవచ్చుని వెల్లడించారు.



