ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
రక్త దాన శిబిరానికి విశేష స్పందన
ముందుకొచ్చి రక్తాన్ని దానం చేసిన యువత
చిలకలూరిపేట ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన రక్త దాన శిబిరం
ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయంలో శనివారం మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.
పట్టణంలో ని పలు ప్రాంతాల నుంచి యువకులు ముందుకొచ్చి రక్తాన్ని దానం చేశారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఈ రక్త దాన శిబిరం జరిగింది.
ఆపద సమయంలో,అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు కు గురవుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని,అలాంటి వారి కోసం ఈ రక్త దాన శిభిరాలు ఉపయోగ పడతాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు.
రక్తం ఇచ్చిన యువతను ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎమ్మార్వో హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పలువురు టీడీపీ నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు అభినందించారు.



