మున్సిపాలిటీ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ నిర్వహించాలి
ఈ వ్యవహారంలో సూత్రధారులెవరో నిగ్గుతేల్చాలి
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట మున్సిపాలిటీ లో లక్షల కుంభకోణం వెనుక దాగి ఉన్న పెద్ద మనుషుల భాగోతాన్ని బయటకు వెలికి తీయాలని, ఈ అంశంపై సూత్రధారుల పాత్ర పై సమగ్ర విచారణ నిర్వహించాలని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి కోరారు.
శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ చేసిన అవినీతికి కొంతమంది ఉద్యోగులను బాధ్యులను చేసి సస్పెండ్ చేశారని, ఇదే క్రమంలో ఈ ఉద్యోగి తప్పు చేయటానికి కారకులైన వారు, తప్పును కప్పి పుచ్చి కనీస విచారణ కూడా జరగకుండా సంవత్సరాల తరబడి అడ్డుపడినవారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు.