పోక్సో కేసు లో నిందితుడు అరెస్ట్ జులై 5 వరకు రిమాండ్ విధించిన కోర్టు

వివరాలు వెల్లడించిన SI శివ రామకృష్ణ

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం హౌస్‌గణేష్‌పాడు గ్రామ నివాసి ఆళ్ల కొండలు అనే వ్యక్తి, మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికను మోసపూరితంగా ఆసక్తికరమైన మాటలతో ఆకర్షించి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన గత నెల 15వ తేదీన జరిగింది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యడ్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

నరసరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో విచారణ చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో పాటు వాంగ్మూలాలు సేకరించారు.

నిందితుడిని ఈ నెల 22వ తేదీన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని హైవే వంతెన వద్ద పట్టుకున్నారు.

శుక్రవారం చిలకలూరిపేట అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి (జూనియర్‌ డివిజన్‌) కోర్టుకు హాజరుపరుచగా జూన్‌ 5వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు యడ్లపాడు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.

Share.
Leave A Reply