పేదలకు పెన్నిధి.. సీఎం సహాయ నిధి : చీఫ్ విప్ జీవి
సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 101 మంది లబ్ధిదారులకు, 52,54,652 లక్షలు చెక్కులను శుక్రవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి గారు పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించిన నిధులు, తమకు అందేలా కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు పాల్గొన్నారు.



