భీమేశ్వరస్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీమంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో బుధవారం కన్నుల పండువగా జరిగిన శ్రీ గంగా సమేత భీమేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ మంత్రివర్యులు శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న ఆయన, ప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా స్వామివారి ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించడంపై సంతోషం వ్యక్తంచేసిన ప్రత్తిపాటి వారిని అభినందించారు. ప్రత్తిపాటి, ఎంపీ లావు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, షేక్ టీడీపీ కరిముల్లా, కామినేని సాయిబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, కందుల రమణ, తుబాటి శ్రీహరి, తుపాకుల అప్పారావు, గోపి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



