నరసరావుపేట, కలెక్టరేట్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో,, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు గారు పాల్గొన్నారు.
ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో బ్యాంకింగ్ రంగం వారు చేయూతనివ్వాలని తెలియజేయడం జరిగింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని వీడాలని తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే లోన్ లను అర్హులకు జాప్యం లేకుండా అందజేయాలని సూచిస్తూ.. పల్నాడు జిల్లాలో ఏ బ్యాంక్ పరిస్థితి చూసినా రుణాలు మంజూరు తక్కువగా ఉందని,, ఈ సంఖ్యను పెంచాలని ఆదేశించటం జరిగింది.



