వీధి నాటకము ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
చిలకలూరిపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక క్యాంప్ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 వ తారీకు సాయంత్రం 5 గంటలకు చిలకలూరిపేట లోని కళామందిర్ సెంటర్ నందు కళాజాతర బృందాలతో వీధినాటకముల ద్వార హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ వీధి నాటకములు ద్వారా హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ -క్షయ వ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి, హెచ్ఐవి/ఎయిడ్స్ ఆక్ట్ 2017 గురించి ప్రజలలో అవగాహనా కల్పించారు. సిహెచ్ సి సెంటర్ ఎల్ టి వంశీ , క్యాంపు స్వచ్చంద సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ మరియు ఏఎన్ఎం ఊహ , ఎం ఈ ఏ V. శివ, క్యాంప్ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు