బస్టాండ్, లాడ్జీలపై జిల్లా SP విస్తృత దాడులు

జిల్లా వ్యాప్తంగా యాంటీ సపటైజ్ లో భాగంగా బస్టాండ్,రైల్వే స్టేషన్ లాడ్జి ల చెకింగ్

వాహనాల తనిఖీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు…

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు BD Team, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు మధ్యాహ్నం నుండి లాడ్జిలు మరియు వాహన తనిఖీలు, ఆంటీ సబ్టేజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.

జిల్లాలో ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మందు బాబు లను హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు.

ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు,సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు.

Share.
Leave A Reply