పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా నుండి మార్కెట్ యార్డ్ వరకు చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టిటిడి పాలక మండల సభ్యులు జంగా కృష్ణమూర్తి
ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ
పాకిస్తాన్ నడ్డి విరిచి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నమన్నారు
భారత సైనికుల సంఘీభావంగా భారతదేశమంతటా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఘనంగా తిరంగా యాత్ర చేపట్టాం
దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు
ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్
ప్రతి భారతీయ పౌరుడికి జాతీయ జెండా చూడగానే దేశ భక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయన్నారు
భారతీయుల నినాదం ఒకటే అని దేశమంతా ఐక్యంగా ఉండాలని సమైక్యంగా ఉండాలని ఉక్రముకలను తరిమికొట్టాలన్నారు
ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం అజయ్ శక్తిగా ఎదగటం చూసి ఓర్వలేని కొన్ని శక్తులు ఇలా చేస్తున్నాయని వాటిని తిప్పి కొట్టడంలో భారత సైన్యం సేవలను కొనియాడారు
మహిళల సిందూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ చెప్పింది
ఉగ్రవాదులు భారత్‍పైకి కన్నెత్తి చూడకుండా జవాబిచ్చాం
దేశ రక్షణలో పాతికేళ్ల కుర్రాడు మురళీనాయక్ మనకు స్ఫూర్తి
ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేయాలని మోదీ సంకల్పానికి సంఘీభావం తెలుపుతున్నామన్నారు
ఈ ర్యాలీలో మాజీ సైనికులు ఎన్సిసి విద్యార్థులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు



