శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు – లీలావతి దంపతులు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి గారి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply