చిరంజీవి మేధాన్ష్ కు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జనసేన యువనాయకులు మండలనేని చరణ్ తేజ

చిలకలూరిపేట :జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ నవతారంపార్టీ జాతీయ నాయకులు రావు సుబ్రహ్మణ్యం మనవడు మేధాన్ష్ అనే చిన్నారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీలో చురుకైన యువ నాయకుడిగా గుర్తింపు పొందిన చరణ్ తేజ, రాజకీయాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, వారిఆనందంలోపాలుపంచుకుంటారు.ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ, “చిన్నారి మేధాన్ష్ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల చిరునవ్వులు, వారి ఆనందమే మనందరికీ మానసిక ఉల్లాసాన్ని స్ఫూర్తినిస్తాయి. మేధాన్ష్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.చరణ్ తేజ, మేధాన్ష్ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పిల్లలను చక్కగా ఉన్నత విలువలతో పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ జనసేన కార్యకర్తలు, మేధాన్ష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply