విద్యుత్ అధికారులు దాడులు
విజలెన్స్ దాడులలో అనాదికారక 150సర్వీస్ గుర్తింపు….. 6,00,000/-జారిమానా
44బ్యాచ్ లుగా 19గ్రామాల్లో దాడులు చేసిన విజిలెన్స్
చిలకలూరిపేట రూరల్ సెక్షన్ పరిధిలోని 19 గ్రామములలో సి ఆర్ డి ఎ సర్కిల్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో గుంటూరు టౌన్ 2 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు,డీ పి ఈ & విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి హెచ్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ పరిధిలోని 19 గ్రామములలో 44బ్యాచ్ లుగా విద్యుత్ దాడులు నిర్వహించి అనధికారికంగా అధిక లోడు విద్యుత్ వినియోగము చేసుకుంటున్న 150సర్వీసులకు రు. 6,00,000/-, అనదికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న 4 సర్వీస్ లకు రు. 1,20,000/-మరియు విద్యుత్ కనెక్షన్ బిల్లింగ్ లలో తేడా గమనించిన 1 సర్వీస్ కు రు. 30,0000/-అపరాధ రుసుము కింద జరిమానా విధించటం జరిగింది.
విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరం కింద పరిగణింప బడుతుంది దానికి జైలు శిక్ష కూడా ఉంటుంది రాబోవు రోజులలో ఉన్నత అధికారుల ఆదేశాలతో అనధికార విద్యుత్ వినియోగం చేసినట్లయితే కేసు లు కూడా బుక్ చేస్తామని తరుచుగా దాడులు నిర్వహిస్తామని వారు చెప్పినారు. ఈ దాడులలో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్స్ A.గురునాధ రావు N. మల్లికార్జునప్రసాద్, కె. రవి కుమార్ మరియు 11 మంది అసిస్టెంట్ ఇంజనీర్స్ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నట్లు, చిలకలూరిపేట డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్. అశోక్ కుమార్, చిలకలూరిపేట రూరల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. సురేష్ చెప్పినారు.