బ్రూటల్ మర్డరర్‌కు ఉరిశిక్ష – మహిళ హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు

నరసరావుపేట పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసిన మహిళ హత్య కేసులో దారుణ కిరాతక నేరస్తుడు తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పంది(30), శివసంజీవయ్య కాలనీ, నరసరావుపేటకు చెందినవాడు ఉరిశిక్ష విధించబడ్డాడు. ఈ మేరకు 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి గౌరవనీయులు నేతి సత్యశ్రీ గారు మే 15న తీర్పును ప్రకటించారు. నిందితుడు ఇప్పటికే మరో రెండు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇది పోలీసు, ప్రాసిక్యూషన్ సమర్థతకు నిదర్శనం.

నేరం వివరాలు:
2023 మే 5 ఉదయం లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని సాంబశివ ఫర్నిచర్ షాప్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం రక్తమడుగులో కనిపించింది. ముఖం వద్ద, చెవి వద్ద గాయాలు ఉండటంతో తొలుత ప్రమాదంగా అనుమానించిన పోలీసులు, CCTV ఫుటేజ్ విశ్లేషణలో అసలైన నిజాన్ని బయటపెట్టారు – నిందితుడు సలీమా అనే మహిళను దారుణంగా హతమార్చిన దృశ్యం అందులో స్ఫుటంగా కనిపించింది.

మృతురాలు:
షేక్ సలీమా (52), SRKT లో నివాసం.

దర్యాప్తు & న్యాయ ప్రక్రియ:

గతంలో 1 town P.S లో పనిచేసిన సీఐ ఆకుల అశోక్ కుమార్ కేసు దర్యాప్తును పూర్తిచేసి, నిందితుడిని అరెస్టు చేసి అభియోగ పత్రం కోర్టు కు పంపారు.

ప్రస్తుత సీఐ ఎం.వి. చరణ్ గారు న్యాయ విచారణలో నిష్ణాతంగా వ్యవహరించారు.

DOP B. రామ కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశిరెడ్డి మల్లారెడ్డి న్యాయస్థానంలో పటిష్ఠ వాదనలు సమర్పించి నిందితునికి శిక్షను సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

కోర్టు తీర్పు:
నేరం పూర్తిగా రుజువవ్వటంతో నిందితుడికి ఉరిశిక్ష విధించబడింది. ఇప్పటికే అతను కేసులు: Cr.No. 83/2023, Cr.No. 88/2024 లలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇది అతని మూడో హత్య కేసు.

అభినందనలు:

CI ఆకుల అశోక్ కుమార్
CI M.V. చరణ్
HC అంకినీడు ప్రసాద్
HC షేక్ సలీం
PC మల్లికార్జునరావు,
PC దుర్గయ్య, PC రాము

ఈ అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు, IPS గారు ప్రత్యేకంగా అభినందించారు.

Share.
Leave A Reply