ఆ పాఠశాల ఇకపై జిల్లా పరిషత్‌ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌
– కొండవీడు యూపీ స్కూల్‌ హైస్కూల్‌గా ఉన్నతి
– అలాగే ప్రైమరీ మోడల్‌ స్కూల్‌గా ఎంపిక
– ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ..ఈ ఏడాది నుండే అమలు
– ఆనందంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు
– సమిష్టి కృషితోనే సాధించామని హెచ్‌ఎం జి శ్రీనివాసరావు వెల్లడి

యడ్లపాడు మండలం కొండవీడు యూపీ పాఠశాల హైస్కూల్‌గా అప్‌గ్రేట్‌ అయింది. 2025–26 విద్యాసంవత్సరం నుండి హైస్కూల్‌ తరగతి బోధన ప్రారంభం కానున్నట్లు పాఠశాల హెచ్‌ఎం జి శ్రీనివాసరావు వెల్లడించారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో ప్రైమరీ మోడల్‌ స్కూల్‌ నిర్వహణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. సహుపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు పార్టీల కతీతంగా సహకారం అందించడంతోనే వీటిని సాధించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

Share.
Leave A Reply