మంత్రి లోకేష్‌, బాలకృష్ణతో చీఫ్‌ విప్ జీవీ, మక్కెన సమావేశం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనే యులు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు. ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లిలో ఈ మేరకు వారిద్దర్ని కలిశారు. మంత్రి లోకేష్‌కు ఒక మొక్కను బహూకరించారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు వారిద్దర్ని ప్రత్యేక కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నామ ని, ఈ రోజు కుదరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలతో పాటు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.

Share.
Leave A Reply