టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగెత్తిన పూర్తి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారు అధికారులను ఆదేశించారు. స్థానిక వెల్లటూరు రోడ్లోని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల ను మంజూరు చేసిందన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్ల పనులను త్వరగా పూర్తిచేసి రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసుతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు కమిషనర్ గారు, అధికారులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply