మెగా వైద్య శిభిరాన్ని విజయవంతం చేయండి…. డాక్టర్ ముద్దన రమేష్ బాబు
చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 29వ తేదీన శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఉచిత మెగా నేత్ర వైద్య సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు, ఐ యం.ఏ. చిలకలూరిపేట అధ్యక్షులు డా. ముద్దన రమేష్ బాబు కోరారు. కార్పొరేట్ వైద్యాన్ని చిలకలూరిపేటకు తీసుకువస్తున్న పుల్లారావు సేవలు వెలకట్టలేనివన్నారు. కేవలం శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్థారన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.



