వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా యదేచ్చేగా రోడ్ల మీద ప్రయాణం,, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరి మీద ఫిర్యాదు చేయాలో అర్థం కాని అయోమయం.. లోక్ సత్తా..
వినుకొండ దగ్గర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం మినహా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఇవన్నీ నివారించతగిన ప్రమాదాలని భాను ప్రసాద్ అన్నారు.
ప్రపంచంలో ఈ మాదిరిగా మరే దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణా నష్టం జరగట్లేదు అని అన్నారు. అయినా, అధికారులు అలసత్వం వీడి పటిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా యదేచ్ఛగా తిరగడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న పట్టించుకునే నాధుడే లేరని అన్నారు.
వాహనాలకు నెంబర్ ప్లేట్లు వాడకుండా నేరాలకు పాల్పడిన, యాక్సిడెంట్స్ చేసి ఆపకుండా వెళితే ఎలా పట్టుకోగలుగుతారని అన్నారు? ప్రధాన రహదారులలో సైతం త్రిబుల్ రైడింగ్ చేస్తున్న, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న, మైనర్లు వాహనాలు నడుపుతున్న తగిన చర్యలు తీసుకోలేకపోవడం విచారకరమని అన్నారు. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.



