పిడుగు పాటుకు ఒకరు మృతి
యడ్లపాడు మండలంలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు స్ప్రుహ కోల్పొయి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారుచోల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు మిర్చికోతలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సాయంత్రం సుమారు 5 గంటలకు ఉరుములు, మెరుపులు రావడంతో పనులు నిలుపుదల చేసి ఇళ్లకు వెళ్లాలని పొలం నుండి రోడ్డుపై ఉన్న ఆటో వద్దకు బయలు దేరారు. కొందరు వడివడిగా ముందుకు వెళ్లగా వెనుక వస్తున్న వారికి సమీపాన పిడుగు పడిన భారీ శబ్ధం వినిపించింది. దీంతో ముగ్గురు మహిళలు కింద పడిపోయారు. రోడ్డుపైకి వచ్చిన మహిళలు వెనక వారు ఇంకా రాలేదని వెళ్లి చూడగా ముగ్గురు మహిళలు పొలంలో పడిపోవడం గమనించి కేకలు వేయగా, రైతులు పరుగున వచ్చి చూశారు. వారిలో షేక్ పర్వీన్(35) అనే మహిళ చెవుల నుండి రక్త కారి సంఘటనా స్థలిలోనే మృతి చెందగా, మరో ఇద్దరి స్రృహ కోల్పోయారు. వీరిని యడ్లపాడు ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిండంతో ప్రస్తుతం వారికి ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, వీఆర్యో కేఏచారి మృతిరాలు నివాసానికి వెళ్లి ప్రాధమిక సమాచారాన్ని సేకరించారు. మృతురాలి భర్త షేక్ సైదావలి భర్త దివ్యాంగుడు తాపీ పనులు చేస్తుండగా, వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.