రంగనాధుడికి పూలంగి సేవ
సొలస ఆలయంలో ద్వాదశ ప్రక్షిణలు, పవళింపు సేవలు

యడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో శ్రీభూ సమేత రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం భక్తుజనంతో కళకళలాడింది. ఈనెల 8 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు కైంకర్యాలు నిర్వహణ అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం వేకువ జామునే రంగనాథస్వామికి ఎన్నో రకాల పుష్పాలను భక్తులు మేళతాళాలతో భజాభజీంత్రీలతో గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పర్చూరి రామకష్ణమచార్యులు ఆధ్వర్యంలో భక్తులు స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పూలంగి సేవలు అందించారు. హోమపూజల్ని ముగించారు. సాయంత్రం అత్యధిక మంది భక్తులు పాల్గొని ద్వాదశ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఆయా కార్యక్రమాలను ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామపెద్దలు పర్యవేక్షించారు.

Share.
Leave A Reply