కడియం కోటి సుబ్బారావు పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు

నరసరావుపేట మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం కోటి సుబ్బారావు మృతదేహానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘన నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో తిరుపతిలో కన్నుమూశారు. కడియం కోటి సుబ్బారావు (58) స్వగ్రామం చింతలపాలేనికి పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కడియం కోటి సుబ్బారావు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చింతలపాలెంలోని నివాసం వద్ద సుబ్బారావు భౌతికకాయంపై పూలమాలలు వేసి మృతుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, జీడీసీసీబీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మృతదేహానికి ఘన నివాళులర్పించారు. చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. సుబ్బారావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసరావుపేట ఎంపీపీగా, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు గుర్తు చేసుకున్నారు.

Share.
Leave A Reply