శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అష్టాదశ తమ (18 వ) వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా సోమవారం రోజు రాత్రి జరిగే శ్రీవారి కల్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ప్రత్యేక ఆహ్వానంపై శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్న ప్రసాద వితరణ మరియు దేవస్థాన కమిటీ ఏర్పాటుచేసిన ఇతర కార్యక్రమాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…