శ్రీ భావన్నారాయణ స్వామి వారి ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, ఇనిమేళ్ళ గ్రామంలో వేంచేసి యున్న శ్రీ భావన్నారాయణ స్వామి వారి తిరుణాళ్ళ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.



