నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు చొరవతో పల్లె బాటలకు మరోసారి మహర్దశ

నరసరావుపేట ఎంపీ,టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చొరవతో మరోసారి పల్నాడు గ్రామాల్లోని డొంకలు, పొలాలు రోడ్లు అభివృద్ధి బాట పట్టనున్నాయి. తరచు రైతులు, గ్రామస్థుల నుండి వస్తున్న అభ్యర్థణల మేరకు.. గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేసి.. తన సొంత నిధులు, కొంత రైతుల సహకారం తీసుకుని మంచి ప్రణాళికలతో గ్రామాల్లోని రోడ్లను, డొంకలను అభివృద్ధి చేయించిన విధానాన్ని మరలా పునరావృతం చేయిస్తున్నారు.
కేవలం 10 నెలల్లో 86 గ్రామాల్లో,, 435 కి. మీ మేర గతంలో అభివృద్ధి చేసి.. ఆ గ్రామాల్లో కొత్త కళను తీసుకు వచ్చారు.

అలాగే మరలా పల్నాడు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో శ్రీ కృష్ణ దేవరాయలు.. ఈరోజు అభివృద్ధి పనులను ప్రారంభింప చేశారు.

ఎంపీ కృష్ణ దేవరాయలు తన సొంత నిధులని వెచ్చించి.. మెషినరీ ( క్రేన్ లను ) పంపిస్తే.. గ్రామంలోని నాయకులు, రైతులు.. ఆయిల్ కొట్టించుకుని,, లభ్యతను బట్టి గ్రావెల్, మట్టిని సేకరించి.. అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు.

ఈరోజు కారంపూడి మండలం, కాకానివారి పాలెంలో,, 3కి. మి మేర రోడ్డు అభివృద్ధికి పనులు ప్రారంభం అయ్యాయి.

అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించుకునేందుకు రైతులు, నాయకులు, గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు

Share.
Leave A Reply