జిల్లా ఎస్పీకి 75 ప్రజా ఫిర్యాదు

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు.

పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన బీసుపోగు మరియమ్మ భర్త అయిన ఎలమంద సుమారు 24 సంll క్రితం ఆక్సిడెంట్ లో చనిపోయినట్లు, ఫిర్యాది మగ సంతానం అయిన 25 సం.ల అనీల్ 1 1/2 క్రితం క్యాన్సర్ తో చనిపోయినందు వలన ఫిర్యాది మామ అయిన బీసుపోగు కోటేశ్వరరావు ఫిర్యాది కి ఎలాంటి ఆస్తి ఇవ్వమని, అడిగితే ఇల్లు కూడా సంబంధం లేదు అని బెదిరిస్తునందుకు గాను ఏ ఆధారం లేని ఫిర్యాది బ్రతుకు కొరకు న్యాయం చేయవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.

క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందినటువంటి మౌలాలి చికెన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు, 2015 వ సంవత్సరంలో మేడా భాస్కర రావు వద్ద స్వాతి నాకు అగ్రిమెంట్ వ్రాయించుకొని గత 10 సంవత్సరముల నుండి ఆ స్థలంలో ఎంజాయ్మెంట్ లో ఉన్నట్లు, ఫిర్యాది స్నేహితుడైన మేకల వెంకటేశ్వరరావు గారి అమ్మాయి వివాహం నిమిత్తం స్థలం కాగితాలను షేక్ గుడిపూడి మాబు శుభాని వద్ద తనకా పెట్టి 1,50,000 తీసుకున్నట్లు తదుపరి ఫిర్యాది 1,36,000 30 స్థలం కాగితాలు ఇవ్వమని మిగిలిన 14000 తీసుకొని వెళ్ళినట్లు అందుకు గాను షేక్ గుడిపూడి మాబు సుభాని స్థలం అమ్మేశాను నీ చేతనైతే నువ్వు నాకు ఇవ్వాల్సినది 14000 కాదు బూతులు తిట్టే అధిక వడ్డీలు వసూలు చేస్తున్నందుకు గాను గుడిపూడి మాబు సుభాని పై చట్టపరమైన చర్యలు తీసుకున్న వలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

నరసరావుపేట షాలిం నగర్ కు చెందిన వేముల మోహన్ రావు బి.ఎస్.ఎన్.ఎల్ ఆఫీస్ లో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయినట్లు, ఫిర్యాదుకి షాలిం నగర్ వైఎస్ఆర్ బొమ్మ వద్ద సొంత స్థలం ఉన్నట్లు, సుమారు 2 నెలల నుండి ఫిర్యాదు కుమారుడైన వేముల ప్రసాద్ మరియు అతని కుమారుడైన వేముల దర్శన్ ప్రతిరోజు పైన తెలిపిన స్థలము వారి పేరుతో వ్రాయమని ఫిర్యాదు అద్దె కు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యం చేస్తూ వారికి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దౌర్జన్యం చేసినట్లు, సుమారు ఆరు నెలల క్రితం ఇంటి మీదకు వచ్చి ఫిర్యాదును బెదిరించి స్థలము కాగితాలు బలవంతంగా లాక్కొని వెళ్లిపోయినందుకు గాను తగిన న్యాయం కొరకు శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

చిలకలూరిపేట పట్టణమునకు చెందిన సువర్ణ లక్ష్మి ఆమె చిలకలూరిపేట కు చెందిన డీకొండ హరి శంకర్ అనే వ్యక్తి (మిలటరీ నందు పని చేసి రిటైర్డ్ అయినాడు) పల్నాడు- కో- ఆపరేట్ – సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆర్డీలు, చిట్టీలు వేస్తూ జనం దగ్గర డబ్బులు కట్టించుకుంటూ, సుమారు పదిమంది బాధితుల వద్ద 60,00,000/-డబ్బులు కట్టించుకుని వారికి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, ఈ పల్నాడు కో ఆపరేట్ సొసైటీ బ్యాంక్ నకు ఢీకొండ హరి శంకర్ బోర్డు మెంబర్ కాగా, అతని భార్య ఢీకొండ ఉమా చైర్మన్ గా వ్యవహరిస్తూ కొన్ని రోజుల క్రితం బ్యాంకు ను వేరే వ్యక్తులకు అప్పగించినారు. ప్రస్తుతం 60 లక్షల దాకా రావాల్సిన డబ్బుకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఈ రోజు శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

పెదకూరపాడు గ్రామానికి చెందినటువంటి దిడ్ల అనిత కు 14 సంవత్సరముల క్రితం దిడ్ల మహేష్ తో వివాహం అయినట్లు, అనంతరం ఒక మగ ఒక ఆడ సంతానం కలిగినట్లు, ఫిర్యాదు భర్త వివాహానికి ముందు నుండే మద్యానికి అలవాటు పడి డబ్బుల కొరకు ఫిర్యాదును కొడుతూ, ఇబ్బందులు పెడుతూ ఇల్లు, సంసారం అనే బాధ్యత లేకుండా ప్రతినిత్యం తాగుతున్నట్టు అదేమని అడిగితే చిత్రహింసలకు గురి చేస్తున్నందుకు గాను న్యాయం చేయవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడమైనది.

దుర్గి గ్రామానికి చెందిన పాలపాటి నారాయణమ్మ భర్త సుమారు 20 సంవత్సరాల క్రితం మరణించినట్లు, ప్రస్తుతం ఫిర్యాది కూతురి వివాహం చేసి అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నందుకు గాను, గతంలో అదే గ్రామానికి చెందిన రుద్రోజు నాగేశ్వరరావు కు వడ్డీ కు ఇచ్చినటువంటి 1,80,000/- లు ఇవ్వమని ఎన్నిసార్లు డబ్బులు అడిగినా, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినను డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం చేయవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
అదే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమమునకు వచ్చినటువంటి వారికి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు వెల్ఫేర్ RI L. గోపీనాథ్ గారి అధ్యక్షతన భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

Share.
Leave A Reply