పసుమర్రు లో దొంగలు హల్ చల్
నివాసగృహల్లో చోరీ… బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చెపట్టిన SI అనీల్
చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ నివాసి, ఎలగాల అనసూయమ్మ భర్త పున్నయ్య 52 సంవత్సరాలు C/ యాదవ, Dt.06/05/2025 న ఉదయం 10 గంటల సమయంలో తన బంధువుల ఇంటికని వేల్చూరుకు వెళ్లి తిరిగి 11/05/2025. రాత్రి సుమారు 9 గంటల సమయానికి ఇంటికి రాగా ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో బంగారు వస్తువులు మరియు, ఇంట్లోని సామాన్లు, రాగి బిందెలు రెండు, రాగి చెంబు ఒకటే ఇత్తడిచెంబు ఒకటి, వెండి గ్లాసు ఒకటి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తాను ఇంటిలో లేని సమయంలో చూసి. దొంగిలించుకుని పోయిన విషయానికి గాను ఇచ్చిన రిపోర్ట్ మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్సై జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.