నల్ల బర్లి రైతుల ఆందోళన
– రూ 15 వేలు కనీస ధర కల్పించాలని డిమాండ్

_ ఎడ్లపాడు రెవిన్యూ కార్యాలయం వద్ద ధర్నా
_ తాసిల్దార్ కు వినతి అందజేత

నల్ల బర్లి పొగాకు రైతులు సోమవారం గిట్టుబాటు ధర కోసం ఎడ్లపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కంపెనీలు, ప్రభుత్వం నాణ్యత పేరుతో దిగుబడులను తిరస్కరిస్తూ, ప్రైవేట్ వ్యాపారులకు సైతం విక్రయించనీయకుండా చేస్తున్న చర్యలను నిరసిస్తూ రైతులు తీవ్రంగా విమర్శించారు.

రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నాయి. రైతులకు న్యాయం జరిగే వరకు తమ సంఘాలు భరోసాగా వెన్నంటే ఉంటాయని ఆయా సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. గత రెండేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెట్టుబడి, శ్రమకు సరైన లాభం లేని పరిస్థితులను నాయకులు వివరించారు.

ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం నాయకుడు డా. కొల్లా రాజమోహన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దాసరి వరహాలు, తదితరులు మాట్లాడుతూ, “రైతన్న కష్టాన్ని గాలికొదులుతున్న ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్ల బర్లి పట్ల స్పష్టమైన మద్దతు ధర నిర్ణయించాలి” అని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర రూ 15 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో 5 ఎకరాలు ఈ ఏడాది పొగాకు సాగు అయిందన్నారు సాగు చేసిన వారంతా చిన్న సన్న కారు రైతులేనని కనీసం తమ పండించిన పొగాకును భద్రపరుచుకునేందుకు కూడా అవకాశం లేక పంట పొలాల్లోనే ఉంచుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారన్నారు. బల్లి రకాన్ని బోర్డులో చేర్చాలని, కంపెనీలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని లేకుంటే ప్రభుత్వాలే వాటిని కొనాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళన దశల వారిదిగా ఉధృతం చేస్తామని నాయకులు రైతులు హెచ్చరించారు.

ఆందోళన అనంతరం రైతులు తమ సమస్యలు, డిమాండ్లు పేర్కొన్న వినతిపత్రాన్ని తహసిల్దార్ జెట్టి విజయశ్రీకి అందజేశారు. దీనిని ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు పొగాకు రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share.
Leave A Reply