SP కంచి శ్రీనివాస్ రావు ను కలిసి న పల్నాడు కో -ఆపరేట్ సొసైటీ బ్యాంక్ ఖాతదారులు
చిలకలూరిపేట లో భారీ మోసం
60లక్షల రూపాయలు కట్టించుకొని చేతులెత్తేసిన బ్యాంక్
ఆందోళన వ్యక్త పరుస్తున్న భాదితులు
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులవెల్లువ
చిలకలూరిపేట పట్టణమునకు చెందిన సువర్ణ లక్ష్మి ఆమె చిలకలూరిపేట కు చెందిన డీకొండ హరి శంకర్ అనే వ్యక్తి (మిలటరీ నందు పని చేసి రిటైర్డ్ అయినాడు) పల్నాడు- కో- ఆపరేట్ – సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆర్డీలు, చిట్టీలు వేస్తూ జనం దగ్గర డబ్బులు కట్టించుకుంటూ, సుమారు పదిమంది బాధితుల వద్ద 60,00,000/-డబ్బులు కట్టించుకుని వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, సువర్ణ లక్ష్మి SP కంచి శ్రీనివాస్ రావు కు వివరించింది.ఈ పల్నాడు కో ఆపరేట్ సొసైటీ బ్యాంక్ నకు ఢీకొండ హరి శంకర్ బోర్డు మెంబర్ కాగా, అతని భార్య ఢీకొండ ఉమా,చైర్మన్ గా వ్యవహరిస్తూ కొన్ని రోజుల క్రితం బ్యాంకు ను వేరే వ్యక్తులకు అప్పగించినారు.
ప్రస్తుతం 60 లక్షల దాకా రావాల్సిన డబ్బుకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను సోమవారం భాదితురాలు సువర్ణ లక్ష్మిSP ని కలిశారు.
జమైన నగదు ను విచారణ చేసి ఇప్పించవలసినదిగా ఎస్పీ కి అర్జీ ఇచ్చారు.