చిల‌క‌లూరిపేట‌:
సీఆర్ క్ల‌బ్,చిల‌క‌లూరిపేట క‌ళాప‌రిష‌త్‌, సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈనెల 16,17,18 తేదీల‌లో తెలుగు రాష్ట్రాల స్థాయి తొమ్మిద‌వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. మొద‌టి రోజు శుక్ర‌వారం రాత్రి నాటిక పోటీలు ప్రారంభ‌మౌతాయి. మొద‌టి రోజు నాటిక పోటీల‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్రారంభించ‌నున్నారు. మొద‌టి రోజు హైద‌రాబాద్ క‌ళాంజ‌లి వారి రైతే రాజు నాటిక, చిల‌క‌లూరిపేట కు చెందిన మ‌ద్దుకూరి ఆర్ట్ క్రియేష‌న్ వారి మా ఇంట్లో మ‌హాభార‌తం నాటిక‌, హైద‌రాబాద్ య‌వ‌భేరి వారి నా శ‌త్రువు నాటిక ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. రెండోవ రోజు 17వ తేదీ శ‌నివారం రాత్రి హైద‌రాబాద్ మిత్ర క్రియేష‌న్స్ వారి ఇది ర‌హ‌దారి కాదు నాటిక‌, క‌రీంన‌గ‌ర్ , క‌ళాభార‌తివారి చీక‌టిపువ్వు, విశాఖ‌ప‌ట్నం భ‌ద్రం పౌండేష‌న్ వారి దొందు దొందే నాటిక లు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. మూడో రోజు ఆదివారం 18 తేదీ గుంటూరుకు చెందిన అమ‌రావ‌తి ఆర్డ్స్ వారి చిరుగుమేఘం, చిల‌క‌లూరిపేటకు చెందిన అమెచ్యూర్ డ్ర‌మెటిక్ అసోసియేష‌న్ వారి ఆలీతొ స‌ర‌దాగా, గుంటూరు వారి అమృత‌ల‌హ‌రి దియేట‌ర్ ఆర్ట్స్ నాన్న నేనొచ్చెస్తా నాటిక‌లు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అనంత‌రం స‌న్మాన కార్య‌క్ర‌మం, గెలుపుపొందిన నాటిక‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌ధానం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మాల్లో ప‌లువురు క‌ళాకారులు, క‌ళారంగ ప్ర‌ముఖ‌లు పాల్గొన‌నున్నారు.

Share.
Leave A Reply